అస్సలాము అలైకుమ్.
మీకు శాంతి కలుగుగాక.
ఆ నిజ దేవుడు (అల్లాహ్) ఒక్కడే ఆరాధనలు అర్హుడు అని మీరు నమ్ముతున్నారా?
ముహమ్మద్ ﷺ దేవుని సందేశపరుడు అని మీరు నమ్ముతున్నారా?
అయితే మీకు ఇంకా తెలియకపోవచ్చు కానీ మీరు ఒక ముస్లిం.
(నిజమైన దేవునికి తన సంకల్పాన్ని సమర్పించిన దైవ విధేయుడు) 😊.
మీ విశ్వాసాన్ని ధృవీకరించడానికి దయచేసి క్రింది షహాదహ్ చెప్పండి. లేదా మీరు మీ స్థానిక మసీదును కూడా సందర్శించవచ్చు / మమ్మల్ని సంప్రదించవచ్చు / మీ ముస్లిం స్నేహితులను సంప్రదించవచ్చు.
ఇలా అనండి:
“అష్ హదు అల్-లా ఇలాహఇల్లల్లాహ్,
వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ”
“నేను సాక్ష్యమిస్తున్నాను, ఎవ్వరూ అర్హులు కారు ఆరాధనకు అల్లాహ్ తప్పితే,
నేను సాక్ష్యమిస్తున్నాను, ముహమ్మద్ అల్లాహ్ సేవకుడు మరియు సందేశపరుడు.”
అల్హమ్దులిల్లాహ్. మిమ్మల్ని తన మార్గదర్సకత్వంతో వెలుగులోకి తెచ్చినందుకు అల్లాహ్‌కు సకల విధాలా ప్రశంసలు మరియు కృతజ్ఞతలు.
మీరు సహజంగా పుట్టిన ఇస్లాం (ఏకేశ్వరునికి సమర్పణ, విధేయత) స్థితికి తిరిగి స్వాగతం.
ఇస్లాం దాని ముందు వచ్చిన పాపాలను చెరిపివేస్తుంది కాబట్టి మీ పూర్వ పాపాలు క్షమించబడతాయి 😊* (దొంగతనం వంటి వాటిని మినహాయించి, దొంగిలించిన సామాన్లని వాటి యజమానికి తిరిగి ఇవ్వాలి లేదా వారి పేరు మీద దానం చేయాలి). మీరు అప్పుడే పుట్టిన శిశువులా ఉన్నట్టే. మీ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి (మీ సృష్టికర్త అయిన అల్లాహ్‌ను ఆరాధించడం) మరియు ఆయనను సంతోషపెట్టే జీవితాన్ని గడపడం కోసం మీ రెండవ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి.
మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవడం, మీ సృష్టికర్త అయిన అల్లాతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోవడం.
దీని కోసం ముందుగా తల స్నానం (గుస్ల్) చేయండి మరియు కనీసం ఇస్లాం ప్రార్థన / సలాహ్ / నమాజ్ యొక్క కదలికను చేయడానికి ప్రయత్నించండి.
కాబా వైపుగా మీ ముఖాన్ని ఉంచి, సాష్టాంగ నమస్కారం చేయండి మరియు మీకు మార్గదర్శకత్వం చేసినందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలపండి.
కొత్త ముస్లింల కోసం క్రింది ఉన్న పుస్తకాలను చూడవచ్చు. రోజుకు 5 సార్లు ప్రార్థన చేయడం ప్రారంభించండి మరియు మీ భాషలో ఖురాన్ చదవడం, హదీసులు (ప్రవక్త ﷺ వారి మాటలు) చదవడం ప్రారంభించండి. విషయాలను తేలికగా తీసుకొని ఒక్కొక్కటి చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ చేయండి. ఇస్లాం సులువైనది, మీ మనసు శాంతిగా ఉండేలా చేస్తుంది. మీకు తోడుగా అండగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఉన్నారు - స్వర్గం మరియు భూమిని సృష్టించిన అతను మీ స్నేహితుడు. అతను మిమ్మల్ని అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తారు మరియు మీకు మంచి మాత్రమే కావాలనుకుంటారు. ఇక మీదట మీరు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మీకు ఇస్లాం సజావుగా పరిచయం చేయడానికి మరియు సమయం గడిచేకొద్దీ మీతో పాటు ఉండటానికి మీకు ఒక సలహాదారుడు అవసరమైతే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మనం మాట్లాడుకుందాం 😊.
మన శత్రువు షైతాన్ యొక్క ఉపాయాలు, ప్రణాళికలకు అల్లాహ్ సహాయం తీసుకోండి. అతని ఏకైక ఉద్దేశ్యం మిమ్మల్ని తప్పుదారి పట్టించడం మరియు అతనితో పాటు మిమ్మల్ని కూడా నరకాగ్నిలో కాలెలా చేయటం.
అదే అల్లాహ్ అయితే మీకు మార్గనిర్దేశం చేస్తాడు మరియు ఆ అత్యంత ప్రేమగల సృష్టికర్తను కలుసుకునే స్వర్గం ఇస్తానని వాగ్దానం చేస్తాడు.
ఇస్లాం పై ప్రశ్నల కోసం ఈ కింది సైట్స్ చూడండి:
islamqa.org
ప్రయోజనకరమైన తెలివి మరియు జ్ఞానం ఇవ్వమని దుఆ చేయండి (అల్లాహ్‌ను అడగండి).
జీవిత పరీక్షలో అందరిలాగే మీరు కూడా పరీక్షించబడతారు. కానీ మీరు అల్లాహ్‌ను విశ్వసించి, అయన మీదే ఆధారపడినప్పుడు పరీక్ష చాలా సులభం అవుతుంది ఇన్షా అల్లాహ్ (దేవుని చిత్తంతో).
శాంతంగా ఉండండి, మితంగా ఒక హద్దుకు లోబడి ఉండండి, ఓపికగా ఉండండి మరియు అల్లాహ్ మీకు ఇచ్చిన లెక్కలేనన్ని దీవెనల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి.
ఎంత వీలైతే అంత అత్యుత్తమ ముస్లింగా అవ్వటానికి బాగా ప్రయత్నిచండి మరియు అల్లాహ్ మార్గంలో కష్ట పడి కృషి చేయండి.
జీవితానికి శాంతి మరియు సత్యం ఇచ్చే ఈ సందేశాన్ని మీకు వీలైనంత వరకు ఇతరులకు తెలియజేయండి.
ప్రతి ఒక్కరూ తమ జీవిత ఉద్దేశ్యాన్ని తెలుసుకోవాలి మరియు తమ సృష్టికర్తను ఆరాధిస్తూ సంతోషంగా ఉండాలి.
దీనిలో మంచి అంతా అల్లాహ్ నుండి మరియు చెడు ఏదివున్నా అది పూర్తిగా నా నుండి. ఏది ఏంటో అల్లాహ్ కు బాగా తెలుసు.
మన సృష్టికర్త అయిన అల్లాహ్ కు సకల విధాల స్తుతులు స్తోత్రాలతో ముగిస్తున్నాం.
ప్రవక్త ముహమ్మద్ పై శాంతి మరియు అల్లాహ్ ఆశీస్సులు ఉండుగాక.